రైతుల దయనీయ పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ‘మహర్షి’ చిత్రంలో చూపించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా సినీ, రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘మహర్షి’ సినిమా చూసి చిత్రబృందాన్ని అభినందించారు.
"కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూశాను. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా ''.
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి