Bappi lahiri news: దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్య సమస్యలతో బుధవారం మరణించిన ఆయన అంతక్రియలు.. గురువారం మధ్యాహ్నం, ముంబయిలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో జరిగాయి.
తండ్రి చితి దగ్గర బప్ప లహిరి తెలుగు, హిందీ, బెంగాలీ చిత్రాలకు సంగీతం అందించిన బప్పిలహిరి బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల్లో నేపథ్య గాయకుడిగాను ప్రేక్షకులను అలరించారు. కొన్ని సినిమాల్లో నటించారు. ప్రముఖ యానిమేటెడ్ చిత్రం మోనాలో టమోటోవా పాత్రకు హిందీ డబ్బింగ్ కూడా చెప్పారు.
రథంలో బప్పి లహిరి పార్థివ దేహం సింహాసనం చిత్రానికి సంగీతం అందించడం ద్వారా తెలుగు సినీపరిశ్రమలోకి బప్పిలహిరి అడుగు పెట్టారు. స్టేట్‌రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ చిత్రాలకు బప్పిలహిరి సంగీతం అందించారు. రౌడీగారిపెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్‌బాస్, ఖైదీ ఇన్‌స్పెక్టర్ చిత్రాలకు.. ఆయనే సంగీతం అందించారు. ఇటీవల డిస్కోరాజా చిత్రంలో 'రమ్, పమ్, బమ్' పాటను రవితేజ, శ్రీకృష్ణతో కలిసి పాడారు.
2011లో సంచలనం సృష్టించిన డర్టీ పిక్చర్‌లో "ఊ లాలా" పాటను శ్రేయా గోషాల్‌లతో కలిసి బప్పిలహిరి పాడారు. టైగర్ ష్రాఫ్ హిట్ చిత్రం బాఘీ-3 సినిమాకు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అభిమానులను అలరించారు.
ఇవీ చదవండి: