ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ (72) ఆదివారం(అక్టోబర్ 10) మధ్యాహ్నం (actor Satyajit news) కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గ్యాంగ్రేన్ కారణంగా గతంలో ఆయన ఎడమ కాలును తొలగించారు వైద్యులు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
Actor death: అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి - కన్నడ యాక్టర్ సత్యజిత్ వార్త
ప్రముఖ నటుడు సత్యజిత్(72) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన (actor Satyajit films) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కన్నడ యాక్టర్ సత్యజిత్ కన్నుమూత
తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో దాదాపు 650కుపైగా సినిమాల్లో సత్యజిత్ నటించారు. స్టార్ నటులు రాజ్ కుమార్, విష్ణువర్ధన్, పునీత్ రాజ్, సుదీప్‌లతో కలిసి నటించారు.
ఇదీ చదవండి:'మా' పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. మోహన్‌బాబు ఆగ్రహం