సూపర్‌స్టార్ రజనీకాంత్ హెల్త్ చెకప్ కోసం శనివారం(జూన్ 19) అమెరికాకు పయనం కానున్నారు. కరోనా సంక్షోభం దృష్ట్యా హెల్త్ చెకప్ కోసం యూఎస్ వెళ్లేందుకు ఇటీవలే కేంద్రాన్ని కోరగా.. అందుకు ప్రభుత్వం అనుమతించింది.
RajiniKanth: ఈ నెల 19న యూఎస్‌కు రజనీ - జూన్ 19న అమెరికాకు రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్(RajiniKanth) హెల్త్ చెకప్ కోసం యూఎస్ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. వైద్యం కోసం రజనీ కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించడం వల్ల శనివారం (జూన్ 19)న రజనీ పయనం కానున్నారు.
![RajiniKanth: ఈ నెల 19న యూఎస్‌కు రజనీ Rajinikanth fly to the US for a medical check-up](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12165861-605-12165861-1623930713405.jpg)
RajiniKanth: ఈ నెల 19న యూఎస్‌కు రజనీ
కేవలం కొంతమంది కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో రజనీ యూఎస్ వెళ్లనున్నారు. ఈ విమానంలో 14 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. రజనీ అల్లుడు, హీరో ధనుష్ కూడా హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్'(The Grey Man) చిత్రీకరణ కోసం అమెరికాలోనే ఉన్నారు.
ఇదీ చూడండి..యూఎస్‌కు రజనీ.. కేంద్రం అనుమతి