తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ సీనియర్​ నటుడు కన్నుమూత - gk govinda rao actor

ప్రముఖ సీనియర్​ నటుడు(gk govinda rao news), రచయిత జీకే గోవింద్​ రావ్​(84) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

GK Govind Rao No more
జీకే గోవింద్​ రావ్

By

Published : Oct 15, 2021, 12:30 PM IST

ప్రముఖ సీనియర్​ నటుడు(gk govinda rao news), రచయిత జీకే గోవింద్​ రావ్​(84) తుదిశ్వాస విడిచారు. గత కొద్దీకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు(అక్టోబర్​ 15) తన కూతురు నివాసంలో కన్నుమూశారు(gk govinda rao actor). ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై​ కూడా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గోవింద్​.. 1937, ఏప్రిల్​ 27న జన్మించారు. నటుడు, రచయిత, ఇంగ్లీష్​ ప్రొఫెసర్​గా కెరీర్​ను కొనసాగించారు. ఎన్నో పుస్తకాలను రాశారు. 'గ్రహానా', 'కర్ఫ్యూ', 'అజ్జు', 'శాస్త్రి', 'రే' వంటి హిట్​ సినిమాలు సహా చాలా టీవీ షోలు, సీరియల్స్​లోనూ నటించారు.

ఇదీ చూడండి: జైలు ఖర్చుల కోసం ఆర్యన్‌కు రూ.4,500 మనియార్డర్

ABOUT THE AUTHOR

...view details