తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిఖిల్‌ ఫిక్స్‌ అన్నా.. వెన్నెల నమ్మట్లేదు - Arjun Suravaram Movie | Lavanya Tripati

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. అనివార్య కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై హీరో నిఖిల్​, వెన్నెల కిశోర్​లతో ఓ వీడియో రూపొందించింది చిత్రబృందం.

నిఖిల్

By

Published : Nov 16, 2019, 6:59 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. 'అర్జున్‌ సురవరం'గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది నుంచి అనేక విడుదల తేదీలను మార్చుకుంటూ వస్తోన్న ఈ చిత్రానికి ఎట్టకేలకు ఓ పర్‌ఫెక్ట్‌ ముహూర్తం దొరికింది. నవంబరు 29న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అయితే ఇదే విషయాన్ని ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్‌కు చెప్తే అసలు నమ్మట్లేదు. ఎందుకలా అంటే.. ఇప్పటికే చాలాసార్లు ఈ మాటలు విని విని విసిగిపోయాడు కాబట్టి నిఖిల్‌ చెప్తున్నా దాన్ని చాలా లైట్‌గా తీసుకుని వదిలేస్తున్నాడు వెన్నెల.

తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. డబ్బింగ్‌ స్టూడియో నుంచి బయటకొస్తున్న వెన్నెలకు 'అర్జున్‌ సురవరం' ఈనెల 29న రాబోతున్నట్లు నిఖిల్‌ చెప్పడం.. దాన్ని అతడు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడం. టిక్‌టాక్‌ల మీద ఒట్టు భయ్యా అని ఆఖర్లో నిఖిల్‌ ఒట్టేసి చెప్పడం వంటి సన్నివేశాలతో వీడియో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

ఈ చిత్ర విడుదల తేదీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించినా.. దీనిపై ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ తరహా వినూత్న ప్రచారాన్ని చేపట్టింది చిత్రబృందం. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటించగా.. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వం వహించాడు.

ఇవీ చూడండి.. రికార్డు థియేటర్లలో సల్మాన్ 'దబాంగ్ 3'

ABOUT THE AUTHOR

...view details