కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రానున్న 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్ విధించారు. సాధారణ ప్రజల నుంచి స్టార్ నటీనటుల వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో తమ సొంత పనులే తామే చేసుకుంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఆ వీడియోలను ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. టాలీవుడ్ హాస్యనటుడు వెన్నెల కిశోర్ ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకుంటుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గిన్నెలు కడుగుతూ కనిపించింది.
ఇల్లు ఊడుస్తున్న వెన్నెల.. ప్లేట్లు కడుగుతున్న కత్రినా - entertainment news
లాక్డౌన్ పరిస్థితులతో నిర్బంధంలో ఉన్న పలువురు నటీనటులు.. ఇంట్లో పనిచేసుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారిలో వెన్నెల కిశోర్ ఇల్లు శుభ్రం చేసుకుంటుండగా, గిన్నెలు కడుగుతూ కనిపించింది హీరోయిన్ కత్రినా.
వెన్నెల కిశోర్ కత్రినా కైఫ్
వెన్నెల కిశోర్.. చీపురుతో శుభ్రం చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేసి.. 'దమ్ముంటే కాస్కో దుమ్ముంటే ఉడ్చుకో' అనే సరదా వ్యాఖ్యను జోడించాడు. మరోవైపు ఇంట్లోనే ఉన్న కత్రినా.. గిన్నెలు కడుగుతున్న వీడియోను షేర్ చేసింది.
Last Updated : Mar 25, 2020, 11:13 AM IST