తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సాఫీస్​ను షేక్​ చేస్తున్న మామా-అల్లుళ్లు - Venky Mama news

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'వెంకీమామ' సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ రెండు రోజుల్లో రూ.30.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హీరోలుగా వెంకటేశ్-నాగచైతన్య అలరిస్తున్నారు.

వెంకీమామ రెండురోజుల కలెక్షన్స్​
వెంకటేశ్-నాగచైతన్య

By

Published : Dec 15, 2019, 2:45 PM IST

నిజ జీవితంలో మామ-అల్లుడైన విక్టరీ వెంకటేశ్-నాగచైతన్య.. అదే పాత్రల్లో నటించిన 'వెంకీమామ' ప్రేక్షకులను అలరిస్తోంది. కామెడీ కుటుబ కథాంశం కావడం వల్ల కలెక్షన్స్​ రాబట్టడంలో ముందుంది. వచ్చిన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.30.5 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

వెంకీమామ రెండురోజుల కలెక్షన్స్​ పోస్టర్

ఇందులో మిలటరీ నాయుడుగా వెంకీ, ఆర్మీ అధికారి పాత్రలో నాగచైతన్య నటించారు. వీరిద్దరి సరసన పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా సందడి చేశారు. తమన్ సంగీతం ఆకట్టుకుంటోంది. బాబీ దర్శకత్వం వహించాడు. సురేశ్​బాబు, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు.

ఇది చదవండి: ఎన్టీఆర్, నానితో సినిమా చేయాలనుంది: వెంకటేశ్

ABOUT THE AUTHOR

...view details