తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2019, 8:09 PM IST

ETV Bharat / sitara

రంగులతో కాదు.. మీ రక్తంతో జాతరను ఎరుపెక్కిస్తా

మాస్, కామెడీ​ అంశాల కాంబినేషన్​లో వచ్చిన 'వెంకీమామ' ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

వెంకీమామ ట్రైలర్
విక్టరీ వెంకటేశ్-నాగచైతన్య

"మనిషి తలరాత రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం" అని అంటున్నాడు విక్టరీ వెంకటేశ్. ఇతడు హీరో నాగచైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం 'వెంకీమామ'. ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. అటు నవ్విస్తూనే, ఇటు మాస్​ అంశాలున్న ఈ ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాలు పెంచుతోంది.

'వెంకీమామ' సినిమాలో విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య

"నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు మామ.. చివరికి నీ వల్ల కూడా కాదు", "ఈసారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంతో ఎరుపెక్కిస్తా" వంటి డైలాగ్​లు అలరిస్తున్నాయి.

ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్​పుత్, నాగచైతన్య పక్కన రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. బాబీ దర్శకత్వం వహించాడు. సురేశ్​బాబు-టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details