తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉగాది కానుకగా 'వెంకీమామ' లోగో విడుదల - telugu

తెలుగు తెరపై మరో మల్టీస్టారర్​గా రాబోతున్న చిత్రం వెంకీమామ.  ఈ సినిమాలో నటిస్తున్న  వెంకటేశ్​, నాగ చైతన్యలు నిజ జీవితంలోనూ మామా అల్లుళ్లు కావడం వల్ల సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఉగాది సందర్భంగా మూవీకి సంబంధించిన టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం.

ఉగాది కానుకగా 'వెంకీమామ' లోగో విడుదల

By

Published : Apr 5, 2019, 7:25 PM IST

ద‌గ్గుబాటి వెంక‌టేశ్, అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తోన్న చిత్రం వెంకీమామ. ఈ సినిమా రాజమండ్రిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ ఏప్రిల్‌ 8న ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో విడుదలైంది.

  • కామెడీ జానర్​లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్​పుత్ , చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో కోనా కార్పొరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు తమ‌న్ బాణీలు సమకూర్చాడు.

ద‌స‌రాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాల‌ని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ద‌గ్గుబాటి రానా సైతం నటించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details