'గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు' అంటున్నాడు విక్టరీ వెంకటేశ్. నాగచైతన్యతోఈ హీరో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ 'వెంకీ మామ'. దసరా పండుగ సందర్భంగా తొలి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో వీరిద్దరూ యాక్షన్‌తోపాటు సరదా హాస్యంతో అలరించారు.
జాతరలో వెంకీమామ యాక్షన్ పాఠాలు...! - venky mama movie details
విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం 'వెంకీమామ'. దసరా కానుకగా ఈ సినిమా తొలి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
జాతరలో వెంకీమామ యాక్షన్ పాఠాలు...!
చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా, వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. తమన్ బాణీలు సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో పాట చిత్రీకరణ జరుగుతోంది.కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.