ఫస్ట్‌లుక్‌తోనే 'నారప్ప' సినిమాపై భారీ అంచనాలు పెంచింది చిత్రబృందం. తమిళంలో విజయవంతమైన 'అసురన్'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైన ఈ మూవీ విడుదల తేదీపై టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది.
వెంకటేశ్ 'నారప్ప' వచ్చేది అప్పుడే..! - అసురన్
తమిళంలో ఘనవిజయం సాధించిన 'అసురన్'కు రీమేక్‌గా తెలుగులో 'నారప్ప' చిత్రాన్ని నిర్మిస్తోంది సురేశ్ ప్రొడక్షన్స్. వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా వేసవిలో విడుదలవుతుందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
షూటింగ్ మొదలుపెట్టక ముందే వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది చిత్రబృందం. అయితే అది ఏ రోజో ప్రకటించలేదు. కానీ, కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న 'నారప్ప' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని చిత్రసీమలో వినిపిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి మే 1న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు జరుపుతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కలైపులి ఎస్.థాను, దగ్గుబాటి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోంది.
ఇదీ చూడండి.. ఉదయాన్నే పొలం పనికి వెళ్తున్న శర్వానంద్!