విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న 'నారప్ప' షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోంది. 12 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తెరికాడు రెడ్ డిసెర్ట్(ఎడారి)లో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సీక్వెన్స్ రూపొందిస్తున్నాడు.
ఈ సన్నివేశాలు సినిమాలో ప్రధానంగా మారుతాయని, ఇదొక మంచి అనుభూతినిచ్చిందని చెప్పాడు పీటర్ హెయిన్స్. 'నారప్ప'తో వెంకటేశ్లో మరో కొత్త కోణాన్ని చూస్తారన్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.