ఇప్పటివరకు ఎన్నో పాత్రలతో నవ్వించిన విక్టరీ వెంకటేశ్.. ఇప్పుడు రేచీకటి సమస్యతో నవ్వులు పంచునున్నారట. అనిల్ రావిపూడి తీస్తున్న 'ఎఫ్3' సినిమాలో ఇలా కనిపించనున్నారని సమాచారం. వెంకీతో పాటు ఇందులోని ఇతర పాత్రల్ని ఎంతో వైవిధ్యంగా రూపొందించినట్లు తెలుస్తోంది.
'రాజా ది గ్రేట్' చిత్రంలో రవితేజను అంధుడిగా చూపించి మెప్పించిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు వెంకటేశ్‌తో మరోసారి ఆ తరహా ప్రయోగం చేయబోతున్నారట.