రవితేజ నటిస్తున్న 'క్రాక్' చిత్రంలో అగ్ర హీరో వెంకటేష్ సందడి కనిపించబోతుంది. అలాగని ఆయనేం తెరపై కనిపించరు.. తెర వెనుక నుంచి కథ నడిపిస్తారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. బి.మధు నిర్మాత. శ్రుతిహాసన్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడీ చిత్రం కోసం వెంకటేష్‌తో వాయిస్ ఓవర్ చెప్పిస్తోంది చిత్ర బృందం.