మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీతూ జోసెఫ్ దీన్ని తెరకెక్కించారు. ఇక తెలుగులోనూ రీమేక్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి మార్కులు కొట్టేసింది. శ్రీ ప్రియ దీన్ని తెరకెక్కించారు. ఇందులో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించారు.
'దృశ్యం 2' రీమేక్ రెడీ.. దర్శకుడు ఎవరంటే? - drushyam 2 telugu remake venkatesh
'దృశ్యం 2' తెలుగు రీమేక్ చిత్రీకరణను మార్చి తొలి వారంలో ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాను మాతృకలో దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్యే తెరకెక్కించబోతున్నారని చిత్ర బృందం వెల్లడించింది.
కాగా, ఈ నెల 19న 'దృశ్యం' సీక్వెల్‌గా మోహన్‌లాల్ నటించిన 'దృశ్యం 2' విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇప్పుడీ ఈ సినిమానూ తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలోనూ వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. అయితే ఈ సినిమాను రూపొందించే బాధ్యతలు మాతృకలో దర్శకత్వం వహించిన జోసెఫ్‌కు అప్పగించారని తెలిసింది. ఇప్పటికే ఆయన హైదరాబాద్ కూడా వచ్చారని ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రతినిథి తెలిపారు. ప్రస్తుతం చర్చలు జరగుతున్నాయట. మార్చి తొలి వారంలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సదరు ప్రతినిథి వెల్లడించారు.
ఇదీ చూడండి: 'దృశ్యం 2': మోహన్‌లాల్ కుటుంబానికి మరో సమస్య