తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాబాయ్-అబ్బాయ్​ కాంబోలో సినిమా - Venkatesh-Rana movie

టాలీవుడ్​లో మరో మల్టీస్టారర్​ చిత్రానికి గ్రీన్​సిగ్నల్​ పడింది. ఇందులో విక్టరీ వెంకటేశ్-హీరో రానా కలిసి కనువిందు చేయనున్నారు. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు.

Venkatesh-Rana
వెంకటేశ్-హీరో రానా

By

Published : Nov 9, 2020, 6:59 AM IST

ఇద్దరు కథానాయకులు కలిసి నటిస్తున్నారంటే చాలు.. ఆ సినిమాపై ప్రేక్షకులు ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తుంటారు. ఒక టికెట్టుకి రెండు సినిమాలు చూస్తున్నంత సంబరం. అందుకే తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం మల్టీస్టారర్‌ సినిమాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఒకే కుటుంబంలోని ఇద్దరు కథానాయకులు కలిసి చేసే సినిమా అంటే అభిమానుల్లో మరింత ఆనందం. ఈ తరహా కాంబినేషనల్లో సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం చిరంజీవి - రామ్‌చరణ్‌ కలిసి ఆచార్యలో నటిస్తున్నారు. అలా దగ్గుబాటి కుటుంబ కథానాయకులు కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాదిలో ప్రకటించబోతున్నారు. ఆ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. వెంకటేష్‌ - రానా కలిసి చేయబోయే సినిమా అది.

కథతోపాటు, మిగతా అన్ని ఏర్పాట్లు పక్కా అయ్యాయని రానా తెలిపారు. రానా ప్రస్తుతం విరాటపర్వం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వెంకటేష్‌ నారప్పతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత దగ్గుబాటి మల్టీస్టారర్‌ చిత్రం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు వెంకటేష్‌, ఆయన మేనల్లుడు నాగచైతన్య కలిసి వెంకీ మామ చేశారు. ఈసారి బాబాయ్‌ - అబ్బాయ్‌ కలిసి చేయబోయే సందడి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి వెంకటేశ్ ఆ పాత్రలో.. 1992 తర్వాత మళ్లీ అలా!

సంక్రాంతి రేసులో రానా 'అరణ్య'

ABOUT THE AUTHOR

...view details