ఇకపై భార్యాభర్తలుగా కలిసి ఉండటం లేదంటూ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు నాగచైతన్య-సమంత జోడీ(naga chaitanya samantha latest pics). ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్(venkatesh daggubati movies) పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
"మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి" అంటూ వెంకీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు.