తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవంబర్​లో వెంకీ కొత్త చిత్రం ప్రారంభం! - venkymama

త్రినాధరావు దర్శకత్వంలో వెంకటేశ్ ఓ చిత్రం చేయబోతున్నాడు. నవంబర్​లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

వెెంకటేశ్

By

Published : Aug 24, 2019, 10:00 AM IST

Updated : Sep 28, 2019, 2:07 AM IST

విక్టరీ వెంకటేశ్ హీరోగా కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్​ పూర్తయిన ఈ సినిమా నవంబర్​లో సెట్స్​పైకి వెళ్లనుందని సమాచారం.

వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ అలాంటి కామెడీతో కథను సిద్ధం చేశాడట దర్శకుడు.

ప్రస్తుతం 'వెంకీమామ' చిత్రంలో నటిస్తున్నాడు వెంకటేశ్. నాగచైతన్య మరో పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక కొత్త మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. సురేష్ బాబు నిర్మాతగా వ్యవహించనున్నారు.

ఇవీ చూడండి.. 'ట్రైలర్ విడుదల​ కోసం ప్రత్యేక కార్యక్రమం లేదు'

Last Updated : Sep 28, 2019, 2:07 AM IST

ABOUT THE AUTHOR

...view details