విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న 'నారప్ప' టీజర్ శనివారం విడుదలైంది. ఇందులో రౌద్రంగా కనిపిస్తున్న వెంకీ.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పింది.
'నారప్ప' రౌద్రం... అదిరిపోయిన టీజర్ - venkatesh 'Narappa' latest news
వెంకటేశ్ 'నారప్ప' టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఇద్దరు పిల్లల తండ్రిగా వెంకీ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.
'నారప్ప' రౌద్రం... అదరగొట్టిన టీజర్
తమిళ హిట్ 'అసురన్'కు రీమేక్ ఈ చిత్రం. ఇందులో వెంకీ భార్యగా ప్రియమణి, కుమారుడిగా కార్తిక్ కనిపించనున్నారు. 1980ల నాటి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తుండగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.