విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు వెంకటేశ్-మీనా. 'చంటి' మొదలుకొని పలు చిత్రాల్లో కలిసి నటించి, విజయాల్ని సొంతం చేసుకున్నారు. చివరిగా ఈ జోడీ 'దృశ్యం'తో సందడి చేసింది. దానికి సీక్వెల్‌గా రానున్న 'దృశ్యం2'తో మరోసారి ఈ జోడీ తెరపైకి కనిపించనుంది.
అదే జోడీతో తెలుగు 'దృశ్యం2' - venkatesh meena drishyam 2
'దృశ్యం-2' తెలుగు రీమేక్‌తో మరోసారి హీరో వెంకటేశ్-మీనా జోడీ తెరపై సందడి చేయనుంది. అంతకుముందు 'దృశ్యం'లో ఈ జంట కనువిందు చేశారు. మార్చి 5 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
వెంకీ
మలయాళంలో ఇటీవలే విడుదలై విజయవంతమైన 'దృశ్యం2'ను, తెలుగులో రీమేక్ చేయనున్నారు. మాతృకని తెరకెక్కించిన జీతూజోసెఫ్ దర్శకత్వంలోనే సినిమా రూపొందనుంది. మార్చి 1నే ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతున్నట్టు తెలిసింది. మార్చి 5 నుంచి చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి: మాస్-క్లాస్ తేడాను 'చెక్' చెరిపేస్తుంది: రాజమౌళి
Last Updated : Feb 22, 2021, 7:11 AM IST