'నారప్ప'(venkatesh narappa) అంటూ ఓటీటీలో వచ్చి, ప్రేక్షకుల్ని అలరించిన విక్టరీ వెంకటేశ్.. మరోసారి అదే మాధ్యమంలో తన కొత్త సినిమాతో సందడి చేయనున్నారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ హిట్ 'దృశ్యం 2'(venkatesh drishyam 2) తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్‌ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్.. ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు.
ఇప్పుడు వెంకటేశ్ 'దృశ్యం 2'ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అక్టోబరు 13న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా రావాల్సిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడటం వల్ల వెంకీ ఈ నిర్ణయానికి వచ్చారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.