రీమేక్, కుటుంబా కథా సినిమాలు అంటే టాలీవుడ్లో ముందు గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేశ్. ఆయన నటించిన చిత్రాల్లో కొన్ని రీమేక్‌లే అయినప్పటికీ, ప్రేక్షకులకు ఎక్కడ అసలు సందేహమే రాకుండా, తన నటనతో వాటిని మరోస్థాయికి తీసుకెళ్లి సూపర్హిట్లు చేశారు వెంకీ. అలాంటి సినిమాల్లో ఒకటి 'చంటి' .
తమిళంలో 1991లో వచ్చిన 'చిన్నతంబి'కి తెలుగు రీమేక్ 'చంటి'. ఇందులో వెంకటేశ్, అమాయకత్వంతో కూడిన పాత్రలో మెప్పించగా, హీరోయిన్గా మీనా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మీనా గదిలో ఉండే మంచానికి పెద్ద కథే ఉంది!