తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆమె.. సినిమాల్లో మహిళా ప్రాధాన్యతను పెంచారు' - కృష్ణ

విజయనిర్మల మృతిపట్ల సంతాపం తెలిపారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టాలీవుడ్​లో మహిళా ప్రాధాన్యతను ఆమె పెంచారని ట్వీట్ చేశారు.

'ఆమె.. సినిమాల్లో మహిళా ప్రాధాన్యతను పెంచారు'

By

Published : Jun 27, 2019, 9:14 AM IST

టాలీవుడ్​ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసి ఎంతో విచారించానన్నారు.

బాలనటిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశించి విజయనిర్మల ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా ఖ్యాతి సాధించారని, టాలీవుడ్​లో మహిళా ప్రాధాన్యత పెంచిన దర్శకురాలు.. విజయనిర్మల అని ట్వీట్ చేశారు వెంకయ్య నాయుడు.

విజయనిర్మల మృతి పట్ల వెంకయ్యనాయుడు ట్వీట్
విజయనిర్మల మృతి పట్ల వెంకయ్యనాయుడు ట్వీట్

ఇది చదవండి: అసమాన ప్రతిభకు కొలమానం.. 'విజయ' ప్రస్థానం

ABOUT THE AUTHOR

...view details