మెగాహీరో వరుణ్‌తేజ్ 'వాల్మీకి' కోసం అద్భుతమైన పాటను రీమేక్ చేశారు. శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని 'వెల్లువచ్చి గోదారమ్మ' గీతాన్ని.. వాల్మీకి కోసం తిరిగి రూపొందించారు. ఆ మేకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒరిజినల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కించినట్లు ఈ పాటను చూస్తుంటే తెలుస్తోంది.
వెండితెరపై మరోసారి 'వెల్లువచ్చి గోదారమ్మ' - వాల్మీకీ
'వాల్మీకి' కోసం అలనాటి హిట్ గీతం 'వెల్లువచ్చి గోదారమ్మ'ను రీమేక్ చేశారు. ఈ పాట మేకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
వాల్మీకిలో వెల్లువచ్చి గోదారమ్మ పాట
ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రతినాయక లక్షణాలున్న రోల్లో కనిపించనున్నాడు వరుణ్‌తేజ్. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇదీ చూడండి: సైరా ప్రీరిలీజ్ వాయిదా!.. మరి ట్రైలర్..?
Last Updated : Sep 30, 2019, 8:55 PM IST