తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియాకు 'దబంగ్​ 3' నిర్మాత సినిమా ఆఫర్​! - sushant case latest news

సుశాంత్​ కేసులో అరెస్ట్​ అయిన రియా చక్రవర్తితో కలిసి భవిష్యత్తులో సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత నిఖిల్​ ద్వివేది తెలిపారు. నేరం తేలే వరకు.. ఎవరైనా నిర్దోషులేనని ఆయన పేర్కొన్నారు.

రియా
rhea

By

Published : Sep 9, 2020, 6:47 PM IST

బాలీవుడ్​ నటి రియా చక్రవర్తి అరెస్టుపై.. నటుడు, నిర్మాత నిఖిల్​ ద్వివేది స్పందించారు. నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి అయినా నిర్దోషేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రియాతో కలిసి సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. 'వీరే డి వెడ్డింగ్'​, 'దబాంగ్​ 3' వంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన నిఖిల్.. నటి అరెస్టుపై​ ట్విట్టర్​ వేదికగా తన అభిప్రాయాలు తెలిపారు.

"రియా నువ్వెవరో, ఎలాంటి వ్యక్తివో నాకు తెలియదు. బహుశా ఇప్పుడు బయట అందరూ అనుకుంటున్న దానికంటే చెడ్డదానివే కావచ్చు, కాకపోవచ్చు. అయితే ప్రస్తుతం నీ చుట్టూ జరుగుతున్న విషయాలు మాత్రం సహించలేనివి. చట్టవిరుద్ధమైనవి. ఇవన్నీ చక్కబడ్డాక కచ్చితంగా మనిద్దరం కలిసి పని చేద్దాం.

నిఖిల్​ ద్వివేది, సినీ నిర్మాత

నిఖిల్​ ట్వీట్​ను కొంతమంది నెటిజన్లు వ్యతిరేకించారు. రియాకు అవకాశమిచ్చి.. భవిష్యత్​ తరాన్ని పాడు చేయొద్దని పేర్కొన్నారు. బాలీవుడ్​లో ఉన్న కొంతమంది మంచి వ్యక్తుల్లో మీరు ఒకరని భావించామని.. ఇంత త్వరగా అసలు రూపం బయటపడుతుందని అనుకోలేదని ఆరోపించారు.

దీనిపై స్పందించిన నిఖిల్​.. ఆమెను ఇంకా కోర్టు దోషిగా స్పష్టం చేయలేదని.. అంతవరకు నిర్దోషి అవుతుందని పేర్కొన్నారు.

సుశాంత్​ మృతి కేసు డ్రగ్​ కోణంలో భాగంగా.. మాదకద్రవ్య నియంత్రణ సంస్థ(ఎన్సీబీ) మంగళవారం రియాను అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల పాటు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది న్యాయస్థానం. సెప్టెంబర్​ 22 వరకు రియా బైకుల్లా మహిళా జైలులో ఉండనుంది.

ABOUT THE AUTHOR

...view details