తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోహన్​బాబు సినిమా పాటగా 11వ శతాబ్దం గద్యం - mohanbabu ilayaraja

మోహన్​బాబు కొత్త సినిమాలో ఓ సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 11వ శతాబ్దంలోని ఓ గద్యాన్ని పాటగా రూపొందించనున్నారు. ఇప్పటికే దాని రికార్డింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

Vedanta Desika's Raghuveera Gadhyam in mohanbabu 'son of india' movie
మోహన్​బాబు సినిమా పాటగా 11వ శతాబ్దం గద్యం

By

Published : Feb 21, 2021, 6:31 AM IST

నటుడు మంచు మోహన్‌బాబు 'సన్నాఫ్‌ ఇండియా'గా ముస్తాబవుతున్నారు. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు నిర్మాత. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలో 11వ శతాబ్దంలో వేదాంత దేశిక కవి రచించిన 'రఘువీర గద్యం'ను శ్రావ్యమైన పాటగా వినిపించనున్నారు. క్లిష్టమైన సంస్కృత సమాసాలతో సాగే గద్యమిది. శ్రీరామచంద్రుని గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగుతుంటుంది. ఇప్పుడిలాంటి క్లిష్టమైన గద్యానికి బాణీ కట్టాల్సిందిగా ఇళయరాజాను కోరారు మోహన్‌బాబు. దీనికి సంబంధించి ఇటీవల చెన్నైలో జరిగిన ఈ మ్యూజిక్‌ సిట్టింగ్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

ఈ వీడియోలో మోహన్‌బాబు "జయజయ మహావీర మహాధీర ధోళియ" అంటూ రఘువీర గద్యాన్ని ఆశువుగా తన నోట పలికించగా.. "ఏంటి ఇంత కఠినంగా ఉంది. ఏం చేసేది? ఎలా చేసేది? ట్యూన్‌కు ఎలా వస్తుంది?" అని ఇళయరాజా బదులివ్వడం నవ్వులు పూయించింది. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్‌ పూర్తయిందని సమాచారం.

ఇది చదవండి:'ఉప్పెన' చిత్రబృందంపై బాలయ్య ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details