తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వస్తున్నా.. వచ్చేస్తున్నా' వీడియో సాంగ్‌ రిలీజ్ - V movie

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కీలకపాత్రల్లో నటించిన చిత్రం 'వి'. ఈ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​ను పెంచింది చిత్రబృందం. ఇటీవల ట్రైలర్​ను విడుదల చేయగా తాజాగా 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' వీడియో సాంగ్​ను రిలీజ్ చేసింది.

'వస్తున్నా.. వచ్చేస్తున్నా' వీడియో సాంగ్‌ రిలీజ్
'వస్తున్నా.. వచ్చేస్తున్నా' వీడియో సాంగ్‌ రిలీజ్

By

Published : Aug 29, 2020, 8:26 AM IST

నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'వి'. నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. థియేటర్‌లో ప్రేక్షకులను పలకరించాల్సిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలవుతోంది. సెప్టెంబరు 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని పెంచింది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేయగా, ఇప్పుడు ఇందులోని 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' అంటూ సాగే వీడియో గీతాన్ని అభిమానులతో పంచుకుంది.

ఇప్పటికే ఈ సాంగ్ లిరికల్‌ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అమిత్‌ త్రివేది అందించిన స్వరాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. శ్రేయా ఘోషల్‌, అమిత్‌ త్రివేది, అనురాగ్‌ కులకర్ణిలు ఆలపించారు.

నాని 25వ చిత్రంగా 'వి' రాబోతోంది. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌లో నాని డైలాగ్‌లు, నటన ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమాలో నాని ఏవిధంగా అలరించాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details