తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సర్​ సినిమాలో వరుణ్​తో తలపడేదెవరూ..? - boxer movie

మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్​ హీరోగా తెరకెక్కుతున్న 'బాక్సర్​' చిత్రంలో ప్రతినాయకుడి పాత్రపై ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్​సేతుపతిని ముందుగా విలన్​ అనుకున్నా.. అతను అందుబాటులో లేకపోవటం వల్ల మరొకరి కోసం వెతుకులాట ప్రారంభించింది చిత్రబృందం.

varuntej-boxer-movie-vijay sethupathi
బాక్సర్​ సినిమాలో వరుణ్​తో తలపడేదెవరూ..?

By

Published : Jan 23, 2020, 6:01 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

మెగాప్రిన్స్​ వరుణ్‌తేజ్‌ ఇటీవలే 'గద్దలకొండ గణేష్‌'గా మాస్‌ కథాంశంతో వచ్చి విజయం అందుకున్నాడు. దీంతో ఆయన తర్వాతి చిత్రంపై సినీవర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వాళ్ల ఊహకు తగ్గట్టుగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'బాక్సర్‌' అనే టైటిల్​ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఈ కథలో విలన్‌ పాత్ర కీలకంగా ఉండబోతుందట. మరి ఇలాంటి వైవిధ్యభరిత ప్రతినాయక పాత్ర పోషించేందుకు ఎవరు బావుంటారని వెతికే ప్రయత్నంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి పేరు ప్రముఖంగా వినిపించింది. 'సైరా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ్‌సేతుపతి ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేయగలడు. దీంతో ఈ పాత్రకు అతనే కావాలనుకుందట చిత్ర బృందం. కానీ, పలు కారణాల వల్ల విజయ్‌ స్థానంలో మరో నటుడ్ని ఎంపిక చేయబోతున్నారని సమాచారం. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి వరుణ్‌తో ఎవరు తలపడతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చూడండి.. 'అల.. వైకుంఠపురములో' బన్నీ ఆల్​టైమ్​ రికార్డు!

Last Updated : Feb 18, 2020, 1:58 AM IST

ABOUT THE AUTHOR

...view details