వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'వాల్నీకి'. తాజాగా ఈ సినిమా సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలు. అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.
సెప్టెంబరులో రానున్నవరుణ్ తేజ్ వాల్మీకి - varun
వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'వాల్మీకి' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
వరుణ్
తమిళంలో విజయవంతమైన జిగడ్తాండ సినిమాను తెలుగులో ‘వాల్మీకి’ పేరుతో రిమేక్ చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. 'తొలి ప్రేమ'’, '‘ఫిదా'’, ‘'ఎఫ్ 2'’ విజయాల తరవాత ‘వాల్మీకి’ కూడా వరుణ్‌కి గుర్తుండిపోయే చిత్రం అవుతుందని నిర్మాతలు తెలిపారు.
'మిరపకాయ్', 'గబ్బర్‌సింగ్', 'డీజే' చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు హరీష్ శంకర్.