తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మంచి కథ దొరికితే ఏ భాషలోనైనా నటిస్తా: వరుణ్ తేజ్ - రామ్​ చరణ్​

మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్.. ప్రస్తుతం బాక్సింగ్​ కథతో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు. అందుకోసం ఈ ఆటలో మెళకువలు నేర్చుకోవడానికి ముంబయి వెళ్లాడు. ఈ సందర్భంగా బాలీవుడ్​లో నటించటంపై అతడు స్పందించాడు.

Varun-Tej-wants-a-coffee-date-with-find-out-whom
'మంచి కథ దొరికితే ఏ భాషలోనైనా సినిమాకు రెడీ'

By

Published : Feb 5, 2020, 4:14 PM IST

Updated : Feb 29, 2020, 6:58 AM IST

గతేడాది 'గద్దలకొండ గణేష్‌'గా ప్రేక్షకులను అలరించాడు మెగాహీరో వరుణ్ తేజ్‌. ప్రస్తుతం బాక్సర్​ అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో వరుణ్‌.. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అందుకోసం ముంబయిలో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ రాకేష్‌ ఉడయార్‌, ప్రముఖ బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ల వద్ద రెండు వారాలుగా శిక్షణ తీసుకుంటున్నాడీ మెగా హీరో.

ఈ సందర్భంగా బాలీవుడ్‌లో మీ ఫేవరెట్‌ హీరో ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా ... షారుక్ ఖాన్‌కు తను పెద్ద అభిమానినని అన్నాడు. "ఓసారి షారుక్.. చరణ్‌ ఇంటికి వచ్చారు. కానీ, నేను అతడిని దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. షారుక్​​తో కాఫీ తాగుతూ మాట్లాడాలనిపించింది. అతడి నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే అతడితో కలిసి పని చేయాలని ఉంది. అయినా అలా ఎవరికి ఉండదు" అని చెప్పుకొచ్చాడు.

వరుణ్​తేజ్​, షారూక్​ ఖాన్​

"నాకు ఇప్పటికీ బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. షెడ్యూల్‌ సహకరించక కొన్ని, కథలు నచ్చక మరికొన్ని చిత్రాలకు నో చెప్పా. నాకు బాలీవుడ్ చిత్రాలలో నటించడమంటే చాలా ఆసక్తి. కంటెంట్‌ బాగుంటే ఏ భాషలోనైనా నటిస్తాను. మంచి కథలకు భాషా, ప్రాంతీయ భేదాలు అడ్డురావు అనటానికి 'బాహుబలి' ఓ ఉదాహరణ" అని వరుణ్‌తేజ్‌ అన్నాడు.

ఇదీ చూడండి.. తెలుగులో ఓ రోజు ముందుగా 'బ్లాక్​ విడో' సర్​ప్రైజ్​

Last Updated : Feb 29, 2020, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details