తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వాల్మీకి'లో ప్రముఖ దర్శకుడు అతిథి పాత్ర - హరీష్​ శంకర్​

హీరో వరుణ్​తేజ్​ 'వాల్మీకి'లో దర్శకుడు సుకుమార్ ఓ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.​

'వాల్మీకి'లో వరుణ్​ తేజ్

By

Published : Sep 4, 2019, 5:19 PM IST

Updated : Sep 29, 2019, 10:35 AM IST

మెగాహీరో వరుణ్​ తేజ్​.. 'వాల్మీకి'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడీ కథానాయకుడు. ఈ సినిమాలోని అతిథి పాత్రలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ కనిపించనున్నాడని సమాచారం. లేదు లేదు అతడు వాయిస్ ఓవర్ మాత్రమే​ ఇచ్చాడని కొన్ని వదంతులు వస్తున్నాయి. ఏదేమైనా వీటిపై స్పష్టత రావాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

వాల్మీకి సెట్​లో సుకుమార్​ సందడి
వాల్మీకి సెట్​లో సుకుమార్​ సందడి

వరుణ్​కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. శ్రీదేవి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుందీ భామ. అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. హరీశ్​ శంకర్ దర్శకుడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: రాజ్​కుమార్​ రావుతో తొలిసారిగా ప్రియాంక చోప్రా

Last Updated : Sep 29, 2019, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details