తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగా ప్రిన్స్‌ కోసం ఆ రచయిత, దర్శకుడు

మెగాప్రిన్స్ వరుణ్​తేజ్ గద్దలకొండ గణేష్​తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేయబోయే మూవీపై కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

By

Published : Dec 5, 2019, 8:52 AM IST

varun tej
మెగా ప్రిన్స్‌

రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు సురేందర్‌ రెడ్డిది విజయవంతమైన కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్ని దాదాపుగా సూపర్‌ హిట్‌ అయ్యాయి. 'నా పేరు సూర్య'తో దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. ఈ చిత్రం తర్వాత మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

'సైరా' లాంటి పాన్‌ ఇండియా సినిమా తర్వాత సురేందర్‌ రెడ్డి కూడా వరుణ్‌కి కథ వినిపించటానికి సిద్ధం అయ్యాడు. ఇప్పుడు ఈ రచయిత సురేందర్‌ రెడ్డికి దర్శకుడిగా పోటిపడుతున్నాడు. ఈ ఇద్దరూ మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌కి కథలు సిద్ధం చేసుకుని వినిపించారని సమాచారం.

ప్రసుత్తం వరుణ్‌ బాక్సింగ్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వరుణ్‌ తేజ్‌ దర్శకుడిగా మారిన రచయితకి అవకాశం ఇస్తాడా లేక 'సైరా'తో విజయాన్ని ఖాతాలో వేసుకున్న సురేందర్‌ రెడ్డి చేయబోయే చిత్రంలో నటిస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ జనాలు.

ఇవీ చూడండి.. సూపర్​స్టార్ రజనీ కూతురిగా కీర్తి సురేశ్!

ABOUT THE AUTHOR

...view details