'భీష్మ' సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములకు.. మెగా కాంపౌండ్ నుంచి పిలుపొచ్చిందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం వెంకీ ఓ స్క్రిప్టు సిద్ధం చేశారట. ఇటీవలే ఆ కథకు వరుణ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.
'భీష్మ' దర్శకుడితో మెగాప్రిన్స్ కొత్త సినిమా! - వెంకీ కుడుముల వార్తలు
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుముల ఓ సినిమా తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ విన్న వరుణ్.. నచ్చి వెంటనే కథకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ పూర్తి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
'భీష్మ' దర్శకుడితో మెగాప్రిన్స్ కొత్త సినిమా!
అన్ని కుదిరితే 'ఎఫ్ 3' షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. వరుణ్ తేజ్ ప్రస్తుతం.. 'గని', 'ఎఫ్3' సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి:'శ్రీకారం'.. గొప్ప సందేశమిచ్చే చిత్రం: చిరు