Varun tej lavanya tripathi dating: మెగా హీరో వరుణ్ తేజ్‌తో పెళ్లి అంటూ వస్తున్న పుకార్లకు ఫొటోలతో సమాధానమిచ్చింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం తాను సొంతూరులో కుటుంబంతో ఉన్నట్లు చెప్పింది. దీంతో బుధవారం ఉదయం నుంచి వస్తున్న పెళ్లి పుకార్లకు తెరపడినట్లయింది. వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోల వల్లే ఇదంతా జరిగింది.
ఇంతకీ ఏమైందంటే?
వరుణ్ తేజ్ హీరోగా చేసిన 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది లావణ్య త్రిపాఠి. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ మధ్య అందరూ చెవులు కొరుక్కున్నారు. అంతేకాకుండా వరుణ్ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరైంది. దీంతో ఆ వార్తలకు మరింత బలం వచ్చింది. కానీ ఆ తర్వాత ఎలాంటి పుకార్లూ రాలేదు. బుధవారం వరుణ్ పుట్టిన రోజు కావడం వల్ల, వేడుకల కోసం వరుణ్ బెంగళూరు వెళ్లారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో పుకార్ల తాకిడి మళ్లీ మొదలైంది.