తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూజాతో డేటింగ్... పల్లవితో పెళ్లి: వరుణ్ ​తేజ్​ - వరుణ్​తేజ్

'గద్దలకొండ గణేష్'​ చిత్రంతో ఘన విజయం ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్​ హీరో వరుణ్​తేజ్​. తాజాగా ఓ రియాల్టీ షోలో పాల్గొన్న మెగా ప్రిన్స్​... ఆసక్తికర విషయం చెప్పాడు.

సాయి పల్లవితో పెళ్లి..పూజాతో డేటింగ్​: వరుణ్​తేజ్​

By

Published : Sep 24, 2019, 10:15 AM IST

Updated : Oct 1, 2019, 7:22 PM IST

మెగా ప్రిన్స్​ వరుణ్​తేజ్​ 'గద్దల కొండ గణేష్‌'తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ప్రసారమవుతున్న ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ఆయన... వ్యాఖ్యాత వేసిన ప్రశ్నకు సరదాగా సమాధానమిచ్చాడు.

మంచులక్ష్మి యాంకర్​గా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో వరుణ్‌తేజ్‌ పాల్గొని ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా మంచులక్ష్మి ఓ ప్రశ్న వేసింది. "రాశీఖన్నా, సాయిపల్లవి, పూజాహెగ్డేలలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? ఎవరితో డేటింగ్‌కి వెళ్తావు?"అని అడిగింది.

'ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌' షోలో వరుణ్​, మంచులక్ష్మి

వరుణ్‌ వెంటనే "నేను సాయిపల్లవిని పెళ్లి చేసుకుంటాను. రాశీఖన్నాను చంపుతాను. పూజాహెగ్డేతో డేటింగ్‌కు వెళ్తాను" అని సమాధానం చెప్పాడు.

'గద్దలకొండ గణేష్‌' చిత్రానికి హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించింది. సాయి పల్లవి, వరుణ్​ జోడీగా నటించిన 'ఫిదా' సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

సాయిపల్లవి, పూజా హెగ్డేతో వరుణ్​తేజ్​

ఇదీ చదవండి...

Last Updated : Oct 1, 2019, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details