Varun teja birthday: మెగాహీరో వరుణ్‌తేజ్ బర్త్‌డే కానుకగా 'గని' నుంచి స్పెషల్ సర్ప్రైజ్.. 'పవర్ ఆఫ్ గని' వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో బాక్సర్ లుక్‌లో వరుణ్ కేక పుట్టిస్తున్నారు.
మార్చి 18న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. వరుణ్‌తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా చేస్తోంది. తమన్నా ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసింది. సాయి కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ-సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనితో పాటే 'ఎఫ్3' టీమ్ కూడా వరుణ్‌తేజ్‌కు విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది.
అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' చిత్ర రిలీజ్ డేట్ ఖరారైంది. మార్చి 18న థియేటర్లలోకి రానుందని పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాను వరుణ్‌తేజ్ 'గద్దలకొండ గణేష్' సినిమాకు హిందీ రీమేక్‌గా తెరకెక్కుస్తున్నారు. ఇందులో కృతిసనన్, జాక్వెలిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫరాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే మూవీ
మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' సినిమాలోని 'ఫుల్ కిక్' అంటూ సాగే పాటను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 'బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్' ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇంద్రసేన, సంతోష్, నవీనరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. రవి చావలి దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: