తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆసక్తిగా 'గని' టీజర్​.. 'రాంబో'గా విజయ్​సేతుపతి - vijay sethupati new movie

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో వరుణ్​తేజ్​ 'గని' టీజర్​, విజయ్​ సేతుపతి 'కాతువక్కుల రెండు కాదల్' ఫస్ట్​లుక్​ ఉన్నాయి.

varun
వరుణ్​

By

Published : Nov 15, 2021, 11:15 AM IST

Updated : Nov 15, 2021, 11:37 AM IST

"ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం" అని అంటున్నారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఆయన వాయిస్‌ ఓవర్‌తో విడుదలైంది టీజర్‌ 'గని'. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'గని' టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఓ కుర్రాడు.. బాక్సింగ్‌ క్రీడాకారుడిగా ఎలాంటి చరిత్ర సృష్టించాడు? కెరీర్‌లో దూసుకెళ్లే తరుణంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనే ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం కావడంతో ఈసినిమా కోసం వరుణ్‌ ఫిట్‌నెస్‌ విషయంలో ఎంతో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్‌ నటి సాయీ మంజ్రేకర్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 24న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా 'కాతువక్కుల రెండు కాదల్'(kathuvakkula rendu kadhal release date). సేతుపతిని 'రాంబో'గా పరిచయం చేస్తూ ఫస్ట్​లుక్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.

కాతువక్కుల రెండు కాదల్


ఇదీ చూడండి: స్పోర్ట్స్​ డ్రామాగా చరణ్​-గౌతమ్​ సినిమా!

Last Updated : Nov 15, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details