తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ ఘనత సాధించిన తొలి తమిళ హీరో ధనుశ్​! - వరుణ్​ తేజ్​

సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో తమిళ హీరో ధనుశ్(Dhanush)​ అందుకున్న ఘనత, అభిమాని కుటుంబానికి మెగా హీరో చేసిన సాయం సహా పలు సినిమా కబుర్లు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Jul 18, 2021, 9:09 PM IST

తమిళ స్టార్​ హీరో ధనుశ్(Dhanush)​ ఓ మైలురాయిని చేరుకున్నారు. ట్విట్టర్​లో కోటి(10మిలియన్​) ఫాలోవర్లను అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి తమిళ హీరోగా గుర్తింపు పొందారు.

ధనుశ్​కు ఫేస్​బుక్​ పేజ్​లో 7మిలియన్లకు పైగా, ఇన్​స్టాలో 2.8మిలియన్​ ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ది గ్రే మ్యాన్'​, 'ఆయిరాథిల్​ ఓరువన్​ 2'(యుగానికి ఒక్కడు సీక్వెల్​), 'రక్షాబంధన్​', 'డీ44', 'పుధు పెట్టాయ్' సినిమాల్లో నటిస్తున్నారు. ​

ధనుశ్​ రికార్డు

మెగా హీరో వరుణ్​ తేజ్​ మంచి మనసును చాటుకున్నారు. అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల కరీంనగర్​కు చెందిన శేఖర్​ అనే వ్యక్తి కన్నుమూశారు. అది తెలుసుకున్న వరుణ్​.. ఆయన కుటుంబానికి తన వంతుగా రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు.

ప్రస్తుతం ఈ మెగాహీరో 'ఎఫ్​ 3', 'గని' చిత్రాల్లో నటిస్తున్నారు.

వరుణ్​ తేజ్​ దాతృత్వం

ప్రముఖ దర్శకులు మణిరత్నం (Mani Ratnam)-జయేంద్ర (Jayendra Panchapakesan).. నిర్మిస్తున్న'నవరస'(Navarasa) నుంచి 'నానుమ్​' అనే పాటను.. జులై 19న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్​లో సూర్య(Suriya)తో పాటు అరవింద స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, నిత్యా మేనన్, పార్వతి, ఐశ్వర్య రాజేశ్, పూర్ణ, ప్రసన్న, సింహా, గౌతమ్ కార్తిక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు.

నవరస

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా 'గల్లీ రౌడీ'. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను జులై 19న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. జి.నాగేశ్వర్ ‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్(Satyadev Kancharana) ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'తిమ్మరుసు'(Thimmarusu). ఆయన ఇందులో న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. తాజాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది.

సినిమా అప్డేట్స్​
సినిమా అప్డేట్స్​

ఇదీ చూడండి: సూర్య 'నవరస' తొలిరూపు.. 'తిమ్మరుసు' రిలీజ్​ రైట్స్​ ​

ABOUT THE AUTHOR

...view details