తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాల్మీకి షూటింగ్​లో పాల్గొన్న మెగాహీరో - హరీశ్ శంకర్

'వాల్మీకి' సినిమా షూటింగ్​లో నేటి నుంచి పాల్గొంటున్నాడు వరుణ్​తేజ్. ప్రతినాయకుడి పాత్రలో మెగాహీరో కనిపించనుండటం విశేషం.

వాల్మీకి షూటింగ్​లో పాల్గొన్న మెగాహీరో

By

Published : Apr 18, 2019, 12:58 PM IST

ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించేందుకు వరుణ్​తేజ్ సిద్ధమవుతున్నాడు. 'వాల్మీకి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు నుంచే షూటింగ్​లో పాల్గొన్నాడీ మెగాహీరో. సంబంధిత విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు.

వాల్మీకి షూటింగ్​లో పాల్గొన్న మెగాహీరో

తమిళ నటుడు అథర్వ హీరోగా కనిపించనున్నాడు. డబ్​స్మాష్ ఫేం మృణాళిని రవి హీరోయిన్​గా నటించనుంది. ప్రస్తుతం హైదరాబాద్​ పరిసరాల్లో 35 రోజుల పాటు షెడ్యూల్ జరుపుకోనుంది.

తమిళంలో 'జిగర్తాండ' పేరుతో తెరకెక్కిన సినిమాకు రీమేక్​ ఈ వాల్మీకి. సిద్దార్థ్, లక్ష్మీ మేనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. బాబీ సింహా విలన్​గా కనిపించాడు.

ఇది చదవండి: కొడుకు పేరునే దొంగిలించిన తండ్రి..!

ABOUT THE AUTHOR

...view details