తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుణ్​తేజ్​ బర్త్​డే సర్​ప్రైజ్​.. బాక్సర్​ 'గని' - గనిగా వరుణ్​ తేజ్​

యువ కథానాయకుడు వరుణ్​ తేజ్​ బర్త్​డే సర్​ప్రైజ్​ వచ్చేసింది. బాక్సింగ్​ నేపథ్యంలో ఆయన హీరోగా తెరకెక్కుతోన్న సినిమా టైటిల్​ను 'గని'గా చిత్రబృందం ఖరారు చేసింది. ఈ సినిమా ఫస్ట్​లుక్​, మోషన్ పోస్టర్​ను మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ సోషల్​మీడియాలో విడుదల చేశారు.

Varun Tej Birthday update: Ghani Movie first look and Motion poster released by Ram Charan
వరుణ్​తేజ్​ బర్త్​డే సర్​ప్రైజ్​.. బాక్సర్​ 'గని'

By

Published : Jan 19, 2021, 10:25 AM IST

Updated : Jan 19, 2021, 10:51 AM IST

మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ బర్త్​డే సర్​ప్రైజ్​ వచ్చేసింది. బాక్సింగ్​ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్​ను 'గని'గా చిత్రబృందం ప్రకటించింది. వరుణ్ తేజ్​ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్​లుక్​, మోషన్​ పోస్టర్​ను మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ విడుదల చేశారు. ఈ ఏడాది జులైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అందులో వెల్లడించారు.

ఈ సినిమాలో కన్నడ స్టార్​ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సహ జగపతిబాబు, నవీన్​ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. కిరణ్​ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి:బాబాయ్​-అబ్బాయ్​లతో శంకర్​ భారీ మల్టీస్టారర్​!

Last Updated : Jan 19, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details