తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2021, 9:55 PM IST

ETV Bharat / sitara

వరుణ్​ ఫస్ట్​లుక్ అప్​డేట్​.. నవీన్ మాస్ డైలాగ్

కొత్త సినిమా కబుర్లు మళ్లీ మీ ముందుకొచ్చేశాయి. ఇందులో వరుణ్ తేజ్​ 10వ సినిమా సహ నవీన్​ చంద్ర కొత్త సినిమా​ అప్​డేట్స్​ ఉన్నాయి.

varun tej and naveen chandra movie updates
వరుణ్​ ఫస్ట్​లుక్ అప్​డేట్​.. నవీన్ మాస్ డైలాగ్

మెగా హీరో వరుణ్​ తేజ్​ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్​ ఈ నెల 19న విడుదలకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్​ వేదికగా పంచుకుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్​ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సహ జగపతిబాబు, నవీన్​ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. కిర్రణ్​ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

నవీన్​ చంద్ర కథానాయకుడిగా వస్తున్న 'సూపర్​ ఓవర్'​ చిత్రానికి సంబంధించిన ప్రచార వీడియో విడుదలైంది. 'రిస్క్​ చేస్తేనే డబ్బులు వస్తాయి.. దేవుడికి దండం పెట్టుకుంటే కాదు' అంటూ హీరో చెప్పిన డైలాగ్ సహ విజువల్స్​ ఆకట్టుకుంటున్నాయి. హీరో శర్వానంద్ ఈ స్నీక్​ పీక్​ను ఆవిష్కరించారు. చాందినీ చౌదరీ కథానాయికగా చేసిన ఈ చిత్రాన్ని ప్రవీన్ వర్మ దర్శకత్వం వహించారు. సుధీర్ వర్మ నిర్మాత. ఆహా ఓటీటీలో జనవరి 22న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇదీ చూడండి:విజయ్ సేతుపతి మూకీ సినిమా.. పోస్టర్ రిలీజ్

ABOUT THE AUTHOR

...view details