ఎఫ్2, గద్దలకొండ గణేశ్ చిత్రాలతోఈ ఏడాది రెండు విజయాలు సొంతం చేసుకున్నాడు మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్. తన తర్వాతి సినిమాను సాయి కొర్రపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో కథానాయికను ఇంకా ప్రకటించలేదు.
అయితే బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించనున్నట్లు ఫిల్మ్‌వర్గాల సమాచారం. చిత్రబృందంఇప్పటికే ఆమెను సంప్రదించిందట. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన భరత్ అనే నేను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జోడీగా వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది కియారా.