హీరో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'వాల్మీకి' సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు వరుణ్. కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. వరుణ్ లుక్‌కు సంబంధించిన ఓ పిక్‌ను హరీష్ శంకర్ పోస్ట్ చేస్తూ.. ‘వెల్కమింగ్ మై వాల్మీకి.. మొదటి రోజు షూటింగ్ బాగా జరిగింది.. ఇంకా ఇలాంటి రోజుల గురించి ఎదురుచూస్తుంటాను.. ఛాయాగ్రాహకుడు బోస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ హాట్ సమ్మర్‌లో టెర్రిఫిక్ వర్క్ చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు హరీష్.
వాల్మీకి చిత్రంతో తమిళ నటుడు అథర్వ తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి...ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది. మృణాళిని రవి హీరోయిన్.