మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. ఇటీవల వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జులై 30 థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
వరుణ్ 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్.. 'సలార్'లో శ్రుతి హాసన్ - Shruthi Haasan Prabhas
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్' చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది శ్రుతిహాసన్. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

వరుణ్ గని రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'సలార్'. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. నేడు శ్రుతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ యూనిట్లోకి ఆహ్వానించింది. ప్రభాస్ సరసన శ్రుతి నటించడం ఇదే మొదటిసారి.