బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. తనపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. గురువారం తనకు సంబంధించిన ఓ విషయాన్ని చెబుతానని ఇన్స్టాలో వెల్లడించారు. "ఈ విషయాన్ని ఇకపై దాచిపెట్టాలనుకోవడం లేదు. రేపు(గురువారం) మీ వదినను మీ అందరికీ పరిచయం చేద్దామని నిర్ణయించుకున్నాను" అని వరుణ్ ఆ వీడియోలో చెప్పారు.
చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్తో వరుణ్ రిలేషన్లో ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రచారం సాగుతోంది. అయితే ఈ వీడియోలో చెప్పిన వదిన వెండి తెరపైనా? లేదా నిజ జీవితంలోనా? అనే ఆలోచనలో పడ్డారు అతడి అభిమానులు. దీనిపై స్పష్టత రావాలంటే గురువారం వరకు వేచి చూడాల్సిందే.