లాక్‌డౌన్‌తో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ డాన్సర్లకు అండగా నిలిచాడు హీరో వరుణ్ ధావన్. 200 మంది నృత్య కళాకారులకు కష్టాల నుంచి ఊరట పొందేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో కొంత నగదును జమ చేశాడు. బాలీవుడ్ సినిమాల్లో గతంలో డాన్సర్‌గా పనిచేసిన రాజ్ సురానీ ఈ విషయాన్ని వెల్లడించారు.
"ఆర్థిక అవసరాలు ఉన్న డాన్సర్లును హీరో వరుణ్ ధావన్ ఆదుకున్నాడు. అతను హీరోగా డాన్సర్ పాత్రల్లో మూడు సినిమాలు నటించాడు. ఆ చిత్రాల్లోని నృత్యకళాకారులందరికీ సాయం చేశాడు. జీవనోపాధి లేకుండా వారు ఎలా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి సమస్యలు పరిష్కరిస్తానని గతంలో వాగ్దానం చేయగా.. తాజాగా దాన్ని నెరవేర్చుకున్నాడు" అని రాజ్ సురానీ తెలిపారు.