తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుణ్‌-కియారాల కొత్త చిత్రం 'మిస్టర్‌ లేలే'..! - bhoomi

వరుణ్ ధావన్, భూమి పెడ్నేకర్, కియారా అడ్వాణి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్​ను పరిశీలిస్తోందట చిత్రబృందం.

Varun Dhawan
వరుణ్

By

Published : Dec 13, 2019, 5:01 PM IST

బాలీవుడ్ నటుడు వరుణ్‌ ధావన్‌ రచయిత దర్శకుడైన శశాంక్‌ ఖైతాన్‌ డైరెక్షన్​లో ముచ్చటగా మూడోసారి నటించనున్నాడు. ఇందులో కియారా అడ్వాణి, భూమి పెడ్నేకర్‌లు కథానాయికలుగా నటించనున్నారు. పూర్తి రొమాంటిక్‌ కామెడీ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మిస్టర్‌ లేలే' అనే పేరును పరిశీలిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇప్పటికే చాలా పేర్లు పరిశీలించి చివరగా 'మిస్టర్‌ లేలే'ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్చిలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇప్పటివరకు కియారా, వరుణ్, భూమి కలిసి నటించిన సినిమా ఏదీ లేదు. ఇదే తొలిసారి.

వరుణ్‌ ధావన్‌ శశాంక్‌ దర్శకత్వంలో 'హంప్టీ శర్మ కి దూల్హానియా', 'బద్రీనాథ్‌ కి దూల్హానియా' చిత్రాల్లో నటించాడు. వరుణ్, కియారాలు ఇప్పటికే తమతమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వరుణ్‌ ధావన్‌ 'కూలీ నెంబర్‌1' చేస్తుండగా, కియారా 'గుడ్‌ న్యూజ్‌', 'చమక్తే సితారే'లో నటిస్తోంది.

ఇవీ చూడండి.. సమీక్ష: జుమాంజి ది నెక్ట్స్‌ లెవల్‌

ABOUT THE AUTHOR

...view details