తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేమించి పెళ్లిచేసుకున్నోడు 'కూలీ' అని తెలిస్తే..! - Coolie No1 recent update

బాలీవుడ్​ హీరో వరుణ్ ధావన్​ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కూలీ నెం.1'. సారా అలీఖాన్ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్​ తాజాగా విడుదలై నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Varun Dhawan and Sara Ali Khan promise a lot of laughs with Coolie No 1 masala entertainer
ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తి 'కూలీ' అని తెలిస్తే..

By

Published : Nov 28, 2020, 9:09 PM IST

Updated : Nov 29, 2020, 10:53 AM IST

'ఈ ప్రపంచం నా ఇల్లు.. స్టేషన్‌ నా అడ్డా..' అంటున్నాడు కథానాయకుడు వరుణ్‌ ధావన్‌. సారా అలీ ఖాన్‌తో ఆయన జోడీ కట్టిన హిందీ సినిమా 'కూలీ నెం.1'. డేవిడ్‌ ధావన్‌ దర్శకుడు. సారా తండ్రి పాత్రలో పరేష్‌ రావల్‌ నటించారు.

1995లో గోవింద, కరిష్మా కపూర్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'కూలీ నెం.1'ను అదే టైటిల్‌తో రీమేక్‌ చేశారు. డిసెంబరు 25న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా చిత్రం విడుదల కాబోతోంది. శనివారం విడుదల చేసిన ట్రైలర్‌ యూట్యూబ్‌లో వీక్షకుల్ని అలరిస్తోంది. దర్శకుడు డేవిడ్‌ ధావన్‌కు ఇది 45వ చిత్రం కావడం విశేషం.

"నా కుమార్తెకు భారత్‌లో అత్యంత సంపన్నుడైన వ్యక్తి భర్తగా రావాలి అనుకున్నా.. కానీ దేవుడు దానికంటే ఎక్కువ ఆస్తి ఉన్న ధనవంతుడ్ని ఇచ్చాడు.. బుర్జ్‌ ఖలీఫా అతడిదే.. వైట్‌హౌస్‌ను కూడా కొనగలడు" అని నటుడు పరేష్‌ రావల్‌ అంటున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది.

సింగపూర్‌ రాజు మహేంద్ర ప్రతాప్‌ కుమారుడు, ప్రిన్స్‌ రాజ్‌ ప్రతాప్‌ సింగ్‌నంటూ వరుణ్‌ అబద్ధాలు చెబుతాడు. అదే నిజమని నమ్మి.. సారా ఆయన్ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. కట్‌ చేస్తే.. "ఈ ప్రపంచం నా ఇల్లు.. స్టేషన్‌ నా అడ్డా.. నా పేరు రాజు.. అందరూ నన్ను 'కూలీ నెం.1' అంటారు" అంటూ చెప్పి వరుణ్‌ షాక్ ఇస్తాడు. సరదా సన్నివేశాలతో రూపొందించిన ఈ ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ ఆఖరులో లేడీ గెటప్‌లో వరుణ్‌ ధావన్‌ అదరగొట్టాడు. మరి సినిమాలో ఇంకెంత సందడి చేస్తాడో చూడాలి.

Last Updated : Nov 29, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details