బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన రిలేషన్షిప్,పెళ్లి గురించి చెప్పారు. కాబోయే భార్య నటాషా దలాల్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. తామిద్దరం చాలా కాలం నుంచి రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని అనుకున్నామని అన్నారు. కరీనా హోస్ట్‌గా ఉన్న రేడియో షోకు హాజరైన వరుణ్.. ఈ విషయాల్ని పంచుకున్నారు.
"నటాషా, నేను చాలాకాలం నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. ఎప్పటికే ఇలానే ఉందామనుకున్నాం. కానీ మా కుటుంబం మేం పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అలా త్వరలో మా వివాహం జరగనుంది"
-వరుణ్ ధావన్, హీరో